
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న సామెత మనకు సరిగ్గా సరిపోతుంది ఎక్కడో వేల కిలో మీటర్ల దూరం లో ఉన్న ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలో కొట్టుకుంటుంటే ఇక్కడ ఉన్న భారత్ కష్టాల కడలిలో ఎదురీదే పరిస్థితుల్లో ఉంది ఎక్కడో దూరానా యుద్ధం జరుగుతుంటే ఇక్కడ మారుమూల ఆంధ్ర ప్రదేశ్ లోనో , లేక తెలంగాణలోని చిన్న పల్లెటూర్లో ఉన్న వ్యక్తి కష్టాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది…..
వివరాల్లో కి వెళ్తే ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం వల్ల భారత్ లో ఇబ్బందికర పరిస్థితి మొదలయ్యింది నిన్న మొన్నటి వరకు మనకేంటి లే అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంటే నాకేంటి లే అని భావించిన ప్రతి ఒక్కరూ ఈ రోజున స్వయంగా కష్టాలను అనుభవిస్తున్నారు హైదరాబాదులో నిన్నటి వరకు కూడా పెట్రోల్ పైన పెద్దగా ఆంక్షలు లేకపోవడంతో అందరూ హాయిగా తమ తమ సొంత వాహనాల లో తిరగటం మొదలెట్టారు ఈరోజు నుంచి ప్రతి ఒక్క పెట్రోల్ బంకు దగ్గర మినిమం 200 రూపాయలు కానీ లేదా రెండు లీటర్లు పెట్రోల్ మాత్రమే పోస్తామని చెప్పడంతో వాహనదారులు ఇబ్బందులు మొదలయ్యాయని అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు అనగా (మంగళవారం మార్చ్ 24 ) హైదరాబాదులో భారీ వర్షం కురిసింది ఆ నేపథ్యంలో భారీ ఎత్తున ట్రాఫిక్ జాం ఏర్పడింది . దీనికి తోడు ఇంటికి వెళ్ళేటప్పుడు పెట్రోల్ నింపుకుందామని అనుకున్న వాహనదారులకి అసలైన కష్టాలు మొదలయ్యాయి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర పెట్రోల్ బంక్ లో పెట్రోల్ నో స్టాక్ అని చెప్పడం తో వాహనదారుల చాలా ఇబ్బంది పడ్డారు. ఒకవైపు వర్షం మరోవైపు ట్రాఫిక్ జామ్ ఇంకోవైపు పెట్రోల్ లేదనే సూచికలు దీంతో సామాన్యుడు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కోవిడ్ 19 వచ్చినప్పటి పరిస్థితులు మళ్లీ రావచ్చు మీరందరూ అప్రమత్తంగా ఉండండి అని హెచ్చరిక జారీ చేయడంతో ప్రజలందరూ ఏం చేయాలో పాలు పోక తలలు పట్టుకుంటున్నారు.సామాన్యుడు బయటికి వెళ్లాలంటే ఇంధనం కావలసిన పరిస్థితి పోనీ ఇంట్లోనే ఉండి ఏదైనా వండుకు తిందాము అంటే గ్యాస్ దొరకని పరిస్థితి సరే బయటకెళ్ళి ఏదైనా తెచ్చుకుందామా అంటే హోటల్స్ మూసివేసే ఇంకో పరిస్థితి ఇవన్నీ చూస్తుంటే కోవిడ్ 19 లోనే పరిస్థితులు కొంచెం బెటర్ గా ఉన్నాయేమో అనిపించక మానదు. కోవిడ్ టైంలో నే కావాల్సిన ప్రతి వస్తువు దొరికింది, కానీ ఇప్పుడు హోటల్స్ లో గ్యాస్ లేక హోటల్స్ మూసివేత వలన తినడానికి బయట ఏమీ దొరకని పరిస్థితి, పోనీ ఎక్కడకన్నా దూరంగా వెళ్లిపోదామా అంటే వాహనంలో పెట్రోల్ లేని పరిస్థితి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆకాశాన్ని అంటుతున్న ధరలు మరొక ఎత్తు . ప్రతి ఒక్కరు నిత్యవసరాలు ఇంట్లో స్టాక్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇరాన్ ఇజ్రాయిల్ కొట్టుకుంటే మన ఇంట్లో గ్యాస్ కి ఇబ్బంది.మన వాహనంలో పెట్రోల్ కి ఇబ్బంది ఏర్పడుతుంది ఇంతకుముందు ఎక్కడో యుద్ధం జరిగితే వాళ్లే కదా కొట్టుకుంటున్నది మనకేం పోయేదేముందిలే అని భావించిన వాళ్లంతా ఎక్కడ యుద్ధం జరిగిన ఆ యుద్ధం వల్ల మన ఇంట్లో కూడా ఇబ్బంది తలెత్తుతుంది అని చెప్పి అర్థం చేసుకుంటున్నారు.ఇకనైనా ఈ ప్రపంచమంతా యుద్ధాలు మాని శాంతియుతంగా ముందుకు సాగాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.

