ఆశాజనకంగా లేని Samsung S26 అల్ట్రా అమ్మకాలు …!
కొరియన్ దిగ్గజం సామ్సంగ్ గత నెల విడుదల చేసిన ఎస్26 శ్రేణి మొబైల్స్ అమ్మకాలు ఆశించినంత ఆశాజనకంగా లేవని తెలుస్తోంది సాంసంగ్ ప్రతి ఏడాది తీసుకువచ్చే విధంగానే ఏ విధమైనటువంటి పెద్ద మార్పులు లేకుండా తన ఎస్ 26 శ్రేణిని మార్కెట్లోకి విడుదల చేసింది 2025లో విడుదల చేసిన ఎస్ 25 అల్ట్రా ఫోన్ కి ఈ సంవత్సరం అనగా 2026 సంవత్సరంలో విడుదల చేసిన ఎస్ 26 అల్ట్రా ఫోన్ కి పెద్దగా వ్యత్యాసాలు లేకపోవడంతో కొనుగోలుదారులలో ఆసక్తి లేకుండా పోయింది ఈ సంవత్సరం s26 అల్ట్రా ఫోన్లో కొత్తగా ప్రవేశపెట్టిన ప్రైవసీ డిస్ప్లే అనుకున్నంత గొప్పగా లేకపోవడం సామ్సంగ్ కి పెద్ద మైనస్ గా భావించవచ్చు బ్యాటరీ పరిమాణం లో మార్పు లేకపోవడం కెమెరా మరియు ఇతర వేరే విషయాలలోఅనుకున్నంత గొప్ప మార్పులు జరగకపోవడంతో ఈ కొత్త తరం మొబైల్స్ కొనడానికి ప్రజలు అనాసక్తిని కనబరుస్తున్నారని తెలుస్తోంది విడుదలై కొన్ని రోజులు మాత్రమే కావడంతో ముందు ముందు అమ్మకాలు జోరు అందుకోవచ్చు అని శాంసంగ్ప్రతినిధులు ఆశిస్తున్నారు. ధర కూడా గత సంత్సరం కంటే కూడా 10 వేల రూపాయలు ధర అధికంగా ఉండటం గమనార్హం.
ఆశాజనకంగా లేని Samsung S26 అల్ట్రా అమ్మకాలు …! Read More »



